మునగాకు కారం తిని ఉంటారు, మునగాకును పప్పులో వేసుకుని కూడా తిని ఉంటారు. సాధారణ జొన్నపిండి రొట్టెలను కూడా చాలా సార్లు తిని ఉంటారు. కానీ మునగాకు, జొన్నపిండినీ కలిపి చేసిన రొట్టెలను ఎప్పుడైనా తిన్నారా? రుచకిరమైన ఈ రెసిపీతో ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గానూ, సాయంత్రం స్నాక్స్ గానూ, రాత్రి పూట అల్పాహారంగానూ తీసుకోవచ్చు. ఒక్కసారి వీటిని రుచి చూశారంటే మామూలు రొట్టెలను పక్కన పెట్టేసి ఇవే రోజూ కావాలంటారు. అంత రుచిగా ఉంటాయి మునగాకు జొన్న రొట్టెలు.వీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.