మకర రాశి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. మంగళ, బుధవారాల్లో అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఒక సమాచారం సంతోషాన్ని స్తుంది. పత్రాల రెన్యువల్లో ఆలక్ష్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు.