టీఏసీ ఇన్ఫోసెక్లో విజయ్ కేడియా పెట్టుబడి..
ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా టీఏసీ ఇన్ఫోసెక్లో గణనీయమైన వాటాదారు. సెప్టెంబర్ 2024 వరకు అందుబాటులో ఉన్న షేర్ హోల్డింగ్ సమాచారం ప్రకారం.. ఈ కంపెనీలో కేడియాకు 11,47,500 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీ ఈక్విటీలో సుమారు 10.95%! ఆయన కుమారుడు అంకిత్ కేడియాకు 3,82,500 షేర్లు ఉన్నాయి. మొత్తంగా, కేడియా కుటుంబానికి 15,30,000 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీ షేర్లలో 15% ఉంటుంది! ఈ గణాంకాలు కంపెనీ వృద్ధి సామర్థ్యంపై కేడియా కుటుంబానికి ఉన్న బలమైన నమ్మకాన్ని తెలియజేస్తోంది.