పితృదేవతలు ఆశీస్సులు
- వేణీదానం క్రియ ద్వారా పితృదేవతలు సంతోషించి వారి ఆశీస్సులు అందిస్తారని విశ్వాసం.పూర్వజన్మ పాపాలు తొలగి మోక్ష మార్గం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది.
- వేణీదానం చేసిన కుటుంబాల్లో శాంతి, సంపద, సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్మకం. జీవితకాలంలో మహిళలకు సంబధించిన రుతుదోషాలుస్త్రీలకు సంబంధించి ఏ దోష నివృత్తికైనా ఈ వేణీ దాన పూజ చేస్తారు.
- భార్య భర్తలు నూతనవస్త్రాలు ధరించి,విఘ్నేశ్వర పూజ,వేణీదానపూజ నిర్వహించి,భార్యను భర్త ఒడిలో కూర్చుండపెట్టుకోని,జడవేసి కత్తెర తో జడలోని చివరికొసలను కత్తిరించి,ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీదేవతలకు దానం చేయాలి.
- మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు. కానీ ఈ క్షేత్రం లో కేశాలను మునగటం గమనించవచ్చు.జీవితం లో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా,ఈ కార్యక్రమం ఒకసారే చేయాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
- మనపాపాలు మనకేశాలను అంటిపెట్టుకోని వుంటాయి. అందుకే తిరుపతి వెళ్ళినా,గయ,ప్రయాగ క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు. తల్లిదండ్రులు గతించినా, ముండనం చేయించుకోవటం తప్పనిసరి.
- ముండనం ప్రయాగలో, దండనం కాశీ క్షేత్రం లో, పిండనం గయాక్షేత్రం లో తప్పనిసరి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రయాగ వేణీదానం విధానం
పవిత్రంగా స్నానం చేసి, సంకల్పం చెప్పుకోవాలి.గంగానదిలో, గురువుల మార్గదర్శకత్వంలో వేణీదానం చేయాలి.పితృదేవతల కోసం తర్పణం చేసి, వారికి నివేదనలు అర్పించాలి.గోవు దానం, అన్నదానం చేసి, తర్పణాన్ని ముగించాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.