వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 వేల బస్తాలతో రైతులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రాగా, యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. కాగా ఓ వైపు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకు వస్తున్నా.. ఆశించిన స్థాయిలో రేటు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కు దేశీ మిర్చి, వండర్ హాట్, యూఎస్ 341, డీడీ, దీపిక ఇలా వివిధ రకాల మిర్చి వస్తుండగా, దేశీ మిర్చి మినహా మిగతా ఏ రకానికీ 20 వేల గరిష్ట ధర రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.