రకుల్ భర్త నిర్మాత…
మేరే హజ్బెండ్ కా బీవీ సినిమాకు ముదాస్సార్ అజీజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. గత కొన్నాళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 తనకు తెలుగు, తమిళ భాషల్లో పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని ఆశలు పెట్టుకున్నది. కానీ కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రకుల్ నమ్మకాన్ని వమ్ము చేసింది.