నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలంటే టన్నెల్ బోరింగ్ మిషన్ను పూర్తిగా కట్ చేయాల్సిందేనని NDRF అధికారులు చెబుతున్నారని తెలిసింది. శిథిలాల తొలగింపునకు దాదాపు నెల రోజుల సమయం పడుతుందని, అప్పుడుగాని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేమని స్పష్టం చేసినట్టు సమాచారం.