AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు సభలో నినాదాలు ప్రారంభించారు. దీంతో సభలో నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు.
Home Andhra Pradesh ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేలతో కలిసి సభకు హాజరైన జగన్, సభలో వైసీపీ ఆందోళన-ap...