మార్కులతో కొలవద్దు
పిల్లల జీవితాలను వారి రిపోర్టు కార్డులు నిర్వచించవు. విద్య ముఖ్యమే కానీ, అది పిల్లల అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే.పిల్లల జీవితమే చదువు అన్నట్టుగా మార్చవద్దని ఆమె తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. విజయం అనేది కేవలం చదువుతోనే దక్కదని ఎన్నో రకాల దారుల్లో, రంగాల్లో, అంశాల్లో విజయం సాధించవచ్చు అని తల్లిదండ్రులకు భావోద్వేగంతో ఆమె వివరించింది. పిల్లల జీవితాల్ని గ్రేడ్‌లతో కొలవద్దని చెప్పింది.