90 వ దశకంలో అనేక హిట్ సినిమాల్లో నటించి,స్టార్ స్టేటస్ ని పొందిన హీరోయిన్ రోజా(Roja)చిరంజీవి(Chiranjeevi)బాలకృష్ణ(Balakrishna)నాగార్జున(Nagarjuna) వెంకటేష్(Venkatesh)వంటి స్టార్ హీరోల సరసన పోటాపోటీగా నటించి అనేక మంది అభిమానులని కూడా సంపాదించుకుంది.ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో అద్భుతమైన పాత్రలని పోషించడంతో పాటు,టెలివిజన్ రంగంలోకి కూడా అడుగుపెట్టి’జబర్దస్త్’,మోడ్రన్ మహాలక్ష్మి’ లాంటి షోస్ తో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.

రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జబర్దస్త్‌ షో కి గుడ్ బై చెప్పింది.కాకపోతే గత ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చవిచూడటంతో,జబర్దస్త్‌లోకి రోజా మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వినిపించాయి.జబర్దస్త్ మేకర్స్ ని రోజా తన ఎంట్రీ కోసం అడిగిందని,యాజమాన్యం సున్నితంగా తిరస్కరించిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.దీంతో ఇక రోజా హవా బుల్లి తెరపై లేనట్టే అని అందరు అనుకున్నారు.కానీ ఇప్పుడు ప్రముఖ టెలివిజన్ ఛానల్ ‘జీ’ తెలుగులో ప్రారంభం కాబోయే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 కి జడ్జి గా ఉండటం ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.రీసెంట్ గా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వగా, రోజా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.

రోజాతో పాటు హీరో శ్రీకాంత్,ఒకప్పటి హీరోయిన్ రాశి  కూడా తమదైన స్టైల్లో స్టెప్ లు వేసి, ఈ షో ఎలా ఉండబోతుందో చెప్పారు.రోజాతో పాటు ఆ ఇద్దరు కూడా షోలో జడ్జీలుగా ఉండబోతున్నారని తెలుస్తుంది.ఇదే కనుక నిజమైతే టీవీ ప్రేక్షకులకి సరికొత్త సంబరం వచ్చినట్లే.మార్చి 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో మొదలుకానుంది.రోజా,శ్రీకాంత్(Srikanth)కలిసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వేంకటేశ’ వంటి సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకులని మెప్పించారు.రాశి(Rasi)శ్రీకాంత్ కూడా గిల్లికజ్జాలు,ఆమ్మో ఒకటో తారీకు,ప్రేయసి రావే,సుప్రభాతం, కన్యాదానం వంటి పలు హిట్ సినిమాల్లో చేసి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here