2014-19 మధ్య ప్రతి జిల్లాకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. రెండుసార్లు డీఎస్సీ ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఇవన్నీ వైసీపీ మంత్రి గతంలో ఈ సభ సాక్షిగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఇక సంక్షేమంలో కూడా బాగా చేశామన్నారు. రూ.200 పెన్షన్ ని రూ.2 వేలు చేశామన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, పసుపు కుంకుమ కింద ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేశామన్నారు. ఆదరణ పథకం అమలుచేశామన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం చేసి చూపించామన్నారు.
Home Andhra Pradesh ఏప్రిల్/మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు- మంత్రి లోకేశ్ కీలక ప్రకటన-thalliki...