బౌలర్ల జోరు
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. పరుగులు చేసే స్వేచ్ఛ ఇవ్వకుండా వికెట్లు పడగొట్టారు. శిఖా పాండే, మరీన్ కాప్, అనాబెల్ సదర్లాండ్ తలో రెండు వికెట్లు సాధించారు. 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ గుజరాత్ స్కోరు 120 దాటిందంటే భారతి ఫుల్మాలి (40 నాటౌట్) పోరాటమే కారణం.