Samsung’s tri-fold smart phone: శాంసంగ్ ఈ ఏడాది ట్రై ఫోల్డబుల్ ఫోన్ సహా పలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయనుంది. శాంసంగ్ తొలిసారి తీసుకువస్తున్న ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ గురించి అనేక పుకార్లు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. డిస్ప్లే సైజ్, పనితీరు, ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి అనేక లీక్స్ ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. ఫోల్డింగ్ మెకానిజం కారణంగా శాంసంగ్ ఈ ఫోన్ కు గెలాక్సీ జి ఫోల్డ్ అని పేరు పెట్టే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, ట్రై ఫోల్డ్ గురించి ఒక కొత్త రూమర్ బయటకు వచ్చింది. ఇది దాని లాంచ్ టైమ్ లైన్ గురించి ఒక సమాచారాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు హువావే మేట్ ఎక్స్ టి స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ ఫోన్ గా ఉంది. త్వరలో దీనికి పోటీగా శాంసంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ ఉండవచ్చు.