బిల్వపత్రాలలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B1, విటమిన్ B6తో పాటు కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులైన డయబెటీస్ నుండి పైల్స్, గుండె ఆరోగ్యం వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. బిల్వపత్రం తినడం వల్ల ఆరోగ్యానికి లభించే ప్రయోజనాలతో పాటు దాన్ని సేవించే సరైన విధానం గురించి తెలుసుకుందాం.