సిద్ధాంతశేఖరమందు – భూమి, బంగారము, ఆవు, రత్నము, రాగి, వెండి, వస్త్రము మొదలగు వానిని వదలి మిగిలిన నిర్మాల్యాన్ని చండేశునకు నివేదించాలి. ఇతరమైన అన్నము మొదలగునవి, పానీయము, తాంబూలము గంధపుష్పములు శివభుక్తమైన నిర్మాల్యాన్ని అంతా చండునకివ్వాలి. ఆచార్య, శివ, చండుల ఆజ్ఞాభంగమందు ఒక లక్ష (జపం చేయాలి). వారి ధనాన్ని భక్షిస్తే పాదం తక్కువ లక్ష (డెబ్భై ఐదువేలు) చేయాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.