ఇతర దేశాల నుంచి..
అమెరికా, మలేషియా, దుబాయ్‌ల నుంచి కూడా భార్యా బాధితులు ఫోన్‌లో సంప్రదిస్తున్నారని.. జాతీయ అధ్యక్షుడు జి.బాలాజీ రెడ్డి తెలిపారు. భార్యా బాధితుల రక్షణ కోసం చట్టాలు రావాల్సిందేనని అంటున్నారు. గౌరవం కోల్పోతున్నామని, మనశ్శాంతి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, తప్పు లేకుండా పరిహారాలు కోరవద్దని అన్నారు. తమ ఆస్తులకు తమను దూరం చేస్తున్నారని, భార్యలతో ఇబ్బంది పడే భర్తల తరపున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.