Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. ట్రోఫీ ఆరంభానికి ముందు కోహ్లి, రోహిత్ ఫామ్‌పై ఆందోళన, తుది జట్టు కూర్పు విషయంలో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తాయి. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కోహ్లి బ్యాట్‌తోనే తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. కీలక మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి అదరగొట్టాడు. గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్‌తో పాటు టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టగా…బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇంటిముఖం పట్టాయి.