ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు ఆపద అంటే వెళ్లే వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. సనాతన యోధుడు రష్యా అల్లుడు కదా.. రష్యా పక్కనే జర్మనీ ఉంటుందని, అందుకే బాగా తెలిసన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండాలనుకుంటే డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసి చంద్రబాబుపై పోరాడాలని రోజా సూచించారు.