మార్చి 5 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంట్రీ గేటు వద్ద, పరీక్ష ప్రశ్నా పత్రం ఓపెన్ చేసే ప్రిన్సిపాల్ రూమ్ లో, కాలేజి వెనక మైదానం కవర్ అయ్యేలా ఒక్కో సెంటర్ కి మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.