మన శరీరంలో ఉన్న రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్ లెట్లు అనే నాలుగు భాగాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఎర్ర రక్త కణాలు. ఇవి ఎముక మధ్యలో మూల కణాల నుండి ఏర్పడతాయి. ఒక సెకనుకు 20 లక్షల ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయని అంచనా. అంటే మన శరీరం ప్రతిరోజు 400 నుండి 2000 మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.