నాచురల్ స్టార్ నాని(Nani)విజయ్ దేవరకొండ(VIjay Devarakonda)ఈ ఇద్దరకీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.సినిమా,సినిమాకి వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు అభిమానులతో పాటు,ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు.ఇప్పుడు ఈ ఇద్దరు మే నెలలో  ‘హిట్ 3(Hit 3),’కింగ్ డమ్'(Kingdom)అనే సినిమాలతో సందడి చేయనున్నారు.

నిన్న నాని పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ‘హిట్ 3 ‘ టీజర్ రిలీజ్ అయ్యింది.రిలీజైన 24 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్ ని సాధించి ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ టీజర్ ఫిబ్రవరి 12 న రిలీజ్ అవ్వగా,ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యూస్ ని సాధించింది.దీంతో విజయ్ దేవరకొండ రికార్డుని నాని ఒక్క రోజులోనే బ్రేక్ చేశాడంటూ అభిమానులు  సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

హిట్ 3 మే 1 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా శైలేష్ కొలను(Sailesh KOlanu)దర్శకత్వం వహిస్తున్నాడు.నాని, ప్రశాంతి తిప్పర్ నేని సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్రీనిధి శెట్టి(Srinidi Shetty)హీరోయిన్ గా చేస్తుంది.’కింగ్ డమ్’ మే 31 న థియేటర్స్ లోకి  రానుండగా,గౌతమ్ తిన్ననూరి(Gowtham THInnanuri)దర్శకత్వం వహిస్తున్నాడు.సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ సారథ్యం వహిస్తుండగా, హీరోయిన్  పేరు మాత్రం మేకర్స్ ఇంకా అధికారకంగా వెల్లడి చెయ్యలేదు.  

 

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here