ప‌ల్నాడు జిల్లా రొంపిచ‌ర్ల‌లో దారుణం జరిగింది. బాలికను మోసం చేసిన వివాహితుడు.. ఆమెపైనే ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రొంపిచ‌ర్ల‌కు చెందిన బ‌త్తుల నాగ‌రాజు (31)కు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 2017లో త‌న ఇంటి స‌మీపంలో నివ‌సించే 13 ఏళ్ల బాలిక‌పై క‌న్నేశాడు. మాయ‌మాట‌ల‌తో చెప్పి ఆ బాలిక‌ను లోబ‌ర్చుకున్నాడు. నాగ‌రాజుకు పెళ్లి అయిన‌ట్లు ఆ బాలిక‌కు తెలియ‌దు. బాలిక‌తో స‌హ‌జీవ‌నం చేశాడు. ఈ క్ర‌మంలో ఆమెను ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు త‌ల్లిని చేశాడు. ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని చెప్పి.. ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ద‌త్త‌త పేరుతో అమ్మేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here