స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా

2025 లో మొత్తం 18 రోజులు స్టాక్ మార్కెట్ కు సెలవులు ఉన్నాయి. వాటిలో, మహాశివరాత్రి 2025 లో మొదటి స్టాక్ మార్కెట్ సెలవు రోజు. 2025 ఫిబ్రవరిలో వచ్చే ఏకైక స్టాక్ మార్కెట్ సెలవు 26వ తేదీన వచ్చే మహాశివరాత్రి ఒక్కటే కావడం గమనార్హం. మహాశివరాత్రి పండుగ తరువాత, హోలీ కోసం తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు 2025 మార్చి 14 న వస్తుంది. మార్చి 2025 లో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు వస్తాయి. అవి హోలీకి 14 మార్చి 2025, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్) కోసం 31 మార్చి 2025. ఏప్రిల్ నెలలో మొత్తం 4 రోజులు స్టాక్ మార్కెట్ కు సెలవులు ఉన్నాయి. అవి, వార్షిక బ్యాంక్ ముగింపు కోసం ఏప్రిల్ 1, 2025న, ఏప్రిల్ 10 న శ్రీ మహావీర్ జయంతి, 14 ఏప్రిల్ 2025 న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, 18 ఏప్రిల్ 2025న గుడ్ ఫ్రైడే కోసం సెలవులు ఉంటాయి. మే 2025 లో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. అవి 1 మే 2025 మహారాష్ట్ర దినోత్సవం, మేడే, 12 మే 2025 బుద్ధ పూర్ణిమ. 2025 జూన్, జూలై నెలల్లో ట్రేడ్ హాలిడేస్ లేవు. బుద్ధ పూర్ణిమ తరువాత, తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు 15 ఆగస్టు 2025న ఉంది. ఇది ఇది స్వాతంత్య్ర దినోత్సవ సెలవు. ఆ తరువాత, 2025 ఆగస్టు 27 న, అంటే వినాయక చవితి నాడు మరో స్టాక్ మార్కెట్ సెలవు వస్తుంది. సెప్టెంబర్ 2025లో ఆరు రోజులు స్టాక్ మార్కెట్ కు సెలవులు ఉన్నాయి. అవి ఈద్-ఎ-మిలాద్ కోసం 5 సెప్టెంబర్ 2025, మహాత్మా గాంధీ జయంతి / దసరా సందర్భంగా 2 అక్టోబర్ 2025, దీపావళి / లక్ష్మీ పూజకు 21 అక్టోబర్ 2025, దీపావళి బలిప్రతిపాదకు 22 అక్టోబర్ 2025, ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురు నానక్ దేవ్ కోసం 5 నవంబర్ 2025, క్రిస్మస్ సందర్భంగా 25 డిసెంబర్ 2025 స్టాక్ మార్కెట్ కు సెలవులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here