హైదరాబాద్‌లో అరెస్టు..
ఈనెల 13వ తేదీన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. దాడి, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు.