రకరకాల మందులు, ట్యాబ్లెట్లు, సిరప్లు ప్రతి ఇంట్లో ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇంట్లోనే అధికంగా మందులు ఉండే అవకాశం ఉంది. ఆధునిక కాలంలో ఆరోగ్యసమస్యలు ఎక్కువైపోవడంతో అన్నం, బియ్యం, చక్కెరలాగే, మందులు కూడా ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేకపోయినా, అత్యవసర పరిస్థితుల కోసం కొన్ని మందులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది. కానీ, వాటిని ఎక్కడ ఉంచుకోవాలో చాలామందికి తెలియదు.