ఆర్-వ్యాలెట్ లో కనీసం వంద రూపాయల నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ద్వారా టికెట్కు సంబంధించిన పేమెంట్ చేస్తే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. టికెట్ పేమెంట్ చేయడానికి ఈ యాప్లో ఇప్పుడు గూగుల్, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ గేట్వేలను కూడా జోడించారు. దీంతో సులభంగా, త్వరగా పేమెంట్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.