బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అయిన ఎంతో మంది నటీనటులు తెలుగులో చాలా మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నారు. ఇక స్టార్ హీరోల విషయానికి వస్తే.. సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ వంటి వారికి తెలుగులో మంచి సినిమా లభించాయి. ఈ విషయంలో సంజయ్ దత్‌కి మాత్రం అన్యాయం జరిగింది. తెలుగులో చెయ్యక చెయ్యక డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేశాడు. అది కాస్తా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. అంతేకాదు, బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ2 చిత్రంలో సంజు విలన్‌గా నటిస్తాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో సంజయ్ దత్‌ను విలన్‌గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని విలన్ క్యారెక్టర్ సంజు అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావించిన మేకర్స్ ఇటీవల అతన్ని సంప్రదించి కథతోపాటు విలన్ క్యారెక్టర్ గురించి కూడా వివరించారు. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా ఒక మాట అనుకున్నారట. కథ, క్యారెక్టర్, రెమ్యునరేషన్.. ఈ మూడూ బాగా నచ్చడంతో ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి హైదరాబాద్‌లో ఓ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే సంజు సెట్స్‌కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.