మహాశివరాత్రి రోజు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా శివుని ప్రసన్నం చేసుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వేయి అశ్వమేధ యజ్ఞాలు, నూరు వాజపేయ యజ్ఞాల ఫలితం లభిస్తుంది. మహాశివరాత్రి రోజు గంగా స్నానం చేసి, గంగజలంతో శివలింగాన్ని అభిషేకించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు శివ పంచాక్షర స్తోత్రం, శివసహస్రనామం, మహామృత్యుంజయ జపం చేయడం చాలా శుభప్రదం. మీ రాశి ప్రకారం, ఈరోజు మహాశివరాత్రి నాడు శివుడికి ఏమి అర్పించాలి తెలుసుకుందాం.