ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు మార్చి 4న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 2 లోగా సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది.