పోసాని కృష్ణమురళిపై పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా ఉన్న పోసానీ… ఇటీవలనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో ఆయన… చంద్రబాబు, పవన్ తో పాటు పలువురు నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలో… పలువురు టీడీపీ, జనసేన నేతలు పోసానీపై పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా ఇచ్చారు.