Airtel-Tata merger: టాటా ప్లే డైరెక్ట్-టు-హోమ్ (DTH) వ్యాపారాన్ని భారతి టెలిమీడియా లిమిటెడ్‌తో విలీనం చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారతి ఎయిర్‌టెల్ టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని భారతి ఎయిర్ టెల్ ధృవీకరించింది. ‘‘భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, టాటా గ్రూప్ టాటా ప్లే లిమిటెడ్‌లో ఉన్న టాటా గ్రూప్ డైరెక్ట్ టు హోమ్ (‘DTH’) వ్యాపారాన్ని ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ అయిన భార్తి టెలిమీడియా లిమిటెడ్‌తో విలీనం చేయడానికి ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయని మేము తెలియజేయాలనుకుంటున్నాము. పై విషయం చర్చల దశలో మాత్రమే ఉంది” అని భారతి ఎయిర్‌టెల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.