Jos Buttler: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ లీగ్ స్టేజ్ లోనే వెళ్లిపోయిన విషయం తెలుసు కదా. ఆస్ట్రేలియా, తర్వాత ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో వరుస ఓటములతో ఆ టీమ్ మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ అవకాశాలు కోల్పోయింది. దీంతో కెప్టెన్ జోస్ బట్లర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా అన్న ప్రశ్నల మధ్య అతడు ఆఫ్ఘన్ తో మ్యాచ్ తర్వాత స్పందించాడు.