ఇప్ప పువ్వు ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ మీరు విన్నట్లు, అనుకుంటున్నట్లు ఇది కేవలం సారాయి తయారీకి మాత్రమే ఉపయోపడే పదార్థం కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇంగ్లీషులో ఇండియన్ బటర్ ట్రీగా పిలిచే ఈ చెట్టు శాస్త్రీయ నామం ‘డిప్లోనీమా బ్యూటీగేసియా’. ఈ చెట్టు వేర్ల నుంచి పుష్పం, ఫలం వరకూ అన్నీ ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం నుంచి గుండె జబ్బులు, మోకాలి నొప్పులు, చర్మ సమస్యలను తగ్గించడం వరకూ అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. వీటిని వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటి, వీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం రండి..