45 శాతం తగ్గుదల
టెస్లా కార్లు యూరప్‌లో ప్రాచుర్యం పొందాయి. కానీ ఇప్పుడు కొనుగోలుదారులు క్రమంగా బ్రాండ్‌కు దూరమవుతున్నారు. జనవరి 2025లో టెస్లా అమ్మకాలు యూరప్‌లో 45శాతం పడిపోయాయి. జనవరి 2024లో టెస్లా 18,161 యూనిట్లను విక్రయించింది. కానీ 2025 జనవరిలో కంపెనీ అమ్మకాలు 9,945 యూనిట్లకు పడిపోయాయి. ఫ్రాన్స్‌లో అమ్మకాలు 63 శాతం, జర్మనీలో 59.5 శాతం క్షీణించాయి. టెస్లా అమ్మకాలు పడిపోవడానికి గల 3 ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.