ఛాంపియన్స్ ట్రోఫీని వరుణుడు వదలట్లేదు. ముఖ్యంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ లకు రెయిన్ ఎఫెక్ట్ పడుతోంది. గురువారం (ఫిబ్రవరి 27) బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతోంది. దీంతో టాస్ ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేయాల్సింది. షెడ్యూల్ ప్రకారం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాలి.