రామ్ పోతినేని తన 22వ సినిమాని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ‘RAPO 22’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం రామ్ లిరిక్ రైటర్ అవతారమెత్తినట్లు తెలుస్తోంది. (Ram Pothineni)

 

హీరోలు అప్పుడప్పుడు పాటలు పాడటం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఒక హీరో, గీత రచయితగా మారి పాట రాయడం అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు రామ్ కూడా అలాంటి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్న ‘RAPO 22’ కోసం రామ్ ఒక లవ్ సాంగ్ రాశాడట. ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంటుందట. మరి లిరిక్ రైటర్ గా రామ్, ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here