ఇప్పుడు నమ్ముతున్నారు..
‘రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు.. కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. మనం ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశాం. రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తున్నాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.