నగరం చుట్టూ..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలోని పొడవైన రింగ్ రోడ్లలో ఒకటి. ఇది 8 లేన్ల రహదారి. హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ. 6,696 కోట్లు ఖర్చు అయింది. 2012 డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు. ఇది నగర శివార్లలోని ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.