ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలక పోవడానికి కారణం నీటి ఊటనే అని తేల్చి చెప్పారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు. నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదని పేర్కొన్నారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారా చూశానని, ఆ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామన్నారు.