చల్లగా చూడాలని….మంత్రి పొన్నం
మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో పలు శివాలయాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి శివుడికి అభిషేకం చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పొట్లపల్లిలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గొట్లమిట్టలోని శివాలయాన్ని సందర్శించి అభిషేకం నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సక్సెస్ కావాలని శివుడిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.