ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీంని ధోని గెలిపించినట్లు తాను టీవీకే పార్టీని 2026 ఎన్నికల్లో గెలిపిస్తానని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఆదివారం చెన్నైలో దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం తొలి వార్షికోత్సవానికి ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తమిళ రాజకీయాలను అవగాహన చేసుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతున్నానన్న ప్రశాంత్ కిషోర్.. టీవీకే పార్టీ గెలిస్తే పక్కగా తమిళంలో మాట్లాడుతా అని మాటిచ్చారు.