ఎస్ఎల్బీసీ టన్నెల్లో సజీవంగా ఉంటారనుకున్న 8 మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. వాళ్లంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల నిరంతర ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు.. టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీమ్ బుధవారం సాయంత్రం చేరుకుంది. ఆర్మీ, NDRF దాని ప్రకారం.. టన్నెల్ లో చివరి భాగంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఎటుచూసినా మట్టి, బురద, శిథిలాలే కనపిస్తున్నాయి. అసలు ఆ ఎనిమిది మంది జాడలేదు.