మాధవ్ రియాక్షన్ ఇదే…
విజయవాడ పోలీసుల నోటీసులపై గోరంట్ల మాధవ్ స్పందించారు. న్యాయ నిపుణులను సంప్రదించి… కేసును ఎదుర్కొంటానని చెప్పారు. అరెస్టులకు అదిరేది, బెదిరేది లేదని స్పష్టం చేశారు. పోక్సో కేసులోని బాధితుల పేర్లు చెప్పానని తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కానీ ఇదే కేసుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ , హోం మంత్రి అనిత కూడా కూడా మాట్లాడారని.. వారిపై కూడా కేసులు నమోదు చేసి.. విచారించాల్సిన అవసరం ఉందన్నారు.