చివరి స్థానంలో
గ్రూప్-ఎలో పాకిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఖాతాలోనూ ఒక్క పాయింటే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ లో ఆ జట్టు పాక్ కంటే ముందుంది. బంగ్లా నెట్ రన్ రేట్ -0.443 కాగా.. పాకిస్థాన్ ది -1.087 గా ఉంది. దీంతో సొంతగడ్డపై పాక్ దారుణ ప్రదర్శనను ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పాక్ జట్టుపై ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.