ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదె రామయ్య – సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్ బూత్‌లో మంత్రి నారా లోకేష్‌తో కలిసి వెళ్లి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ…ఓటు వేయడం అందరి బాధ్యత అని, దాన్ని హక్కుగా వినియోగించుకోవాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పని చేస్తుందని అన్నారు. చంద్రబాబుతో మంత్రి నారా లోకేష్ ఉన్నారు.