ఇటీవల దుబాయ్‌లో నిర్మాత కేదార్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి కారణం ఏమిటి అనేది ఇప్పటివరకు తెలియలేదు. దుబాయ్‌ పోలీసులు ఇప్పటివరకు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ బయట పెట్టలేదు. గత కొంతకాలంగా కేదార్‌ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అవి కాస్త తీవ్రతరం కావడంతో గుండెపోటుతో మరణించాడని ప్రాథమిక నిర్థారణకు వస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ వస్తే తప్ప అసలు కారణం ఏమిటి అనేది తెలియదు. కేదార్‌ మృతదేహం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. కేదార్‌ మృతదేహం కోసం ముగ్గురు నిర్మాతలు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారన్న అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేదార్‌ చనిపోయిన సమయంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, దుబాయ్‌ పోలీసులు ఈ ఇద్దర్నీ ప్రశించి వారిచ్చిన సమాధానాన్ని రికార్డు చేసుకున్నారని కూడా తెలుస్తోంది. వీరంతా కేదార్‌ మృతదేహం కోసం ఎదురుచూడడం వెనుక రూ.100 కోట్ల మొత్తం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతలు కేదార్‌కి ఆ డబ్బు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు కేదార్‌ లేడు. మరి ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలి అనే విషయంలో ఈ 9 మంది టెన్షన్‌ పడుతున్నారట. మరి ఈ విషయంలో నెక్స్‌ట్‌ ఏం చెయ్యబోతున్నారనేది తెలియాల్సి ఉంది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here