సీనియర్ నటి జయప్రద కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు మృతి చెందారు. ఆయన మరణం కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తన సోదరుడు మృతి చెందిన విషయాన్ని జయప్రద ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అయితే మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అలాగే అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్న సమాచారం కూడా లేదు. సోషల్ మీడియా ద్వారా తప్ప బహిరంగంగా తన సోదరుడి మృతి విషయాన్ని జయప్రద ప్రకటించలేదు. రాజబాబు మృతి పట్ల సినీ, రాజకీయ వర్గాల నుంచి సంతాప సందేశాలు అందుతున్నాయి.