ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలువకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వాన వల్ల బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దవటంతో ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడింది. మరోవైపు, అఫ్గానిస్థాన్ మాత్రం సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‌ను ఓడించి సెమీస్ రేసులో ఉంది.