ఇరిగేషన్‌కు ప్రాధాన్యత..
ధరల స్థికరణ నిధి కోసం రూ.300 కోట్లు, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజన స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ.500 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రకారం.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంది.