శబ్దం మూవీ రివ్యూ 

సినిమాపేరు: శబ్దం 

నటీనటులు:ఆది పినిశెట్టి,లక్ష్మి మీనన్, లైలా,సిమ్రాన్, అభినయ, రెడీన్ కింగ్ స్లే, రాజీవ్ మీనన్ తదితరులు 

రచన,దర్శకత్వం:అరివాలగన్ వెంకటాచలం

సినిమాటోగ్రఫి: అరుణ్  

ఎడిటర్: సాబు జోసెఫ్ 

సంగీతం:థమన్  

నిర్మాత: 7 జి శివ ,భాను ప్రియ శివ 

బ్యానర్ : 7 జి ఫిలిమ్స్ ప్రెజెంట్స్ ,ఆల్ఫా ఫ్రేమ్స్ 

రిలీజ్ డేట్: 28 – 02 -2025 

ఆది పినిశెట్టి(Asdhi pinisetty)చాలా ఏళ్ళ తర్వాత సోలో హీరోగా ఈ రోజు ‘శబ్దం'(shabdham)అనే హర్రర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆది పినిశెట్టి హిట్ మూవీస్ లో ఒకటైన హార్రర్ థ్రిల్లర్ ‘వైశాలి’ దర్శకుడు అరివాలగన్(Arivazhagan)దర్వకత్వంలో ‘శబ్దం’  తెరకెక్కడం,థమన్ మ్యూజిక్ ని అందించడంతో ‘శబ్దం’పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

వ్యూమ (ఆది) చనిపోయిన మనుషుల యొక్క ఆత్మలతో,అవి చేసే శబ్ద తరంగాల ద్వారా మాట్లాడి,వాటి కోరికని నెరవేర్చే ఘోస్ట్ ఇన్విస్టిగేటర్ గా వర్క్ చేస్తుంటాడు.అంతు పట్టని మరణాలకి ‘ఘోస్ట్’ కారణం అని నిర్దారించుకున్న తర్వాతే వ్యూమ  రంగంలోకి దిగుతాడు.ఈ క్రమంలోనే ఒక మెడికల్ కాలేజీ లో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోతే,వాళ్ళని ఘోస్ట్ చంపిందని తెలుసుకొని కేసుని ప్రారంభిస్తాడు.అదే కాలేజీ లో టీచర్ అండ్ స్టూడెంట్ అవంతిక(లక్ష్మి మీనన్) బిహేవియర్ పై వ్యూమకి  అనుమానం వస్తుంది.అవంతిక బిహేవియర్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది.ముప్పై ఐదేళ్ల క్రితం డాక్టర్ గా పని చేసే డయానా( సిమ్రాన్) ఒక చర్చిని నెలకొల్పి పుట్టుకతోనే వికలాంగులైన పిల్లలకి సంగీతం నుంచి వచ్చే ‘శబ్ద తరంగాల’ ద్వారా వాళ్ళని  మాములు మనుషుల్ని చేయవచ్చని నమ్ముతుంది.ఆ దిశగా తన ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.నాన్సీ డానియల్ (లైలా) మెడికల్ కాలేజీ లోనే ఒక ప్రొఫెసర్. గబ్బిలాలు చేసే శబ్ద తరంగాల ద్వారా సరికొత్త బ్లాక్ మ్యాజిక్ ని కనిపెట్టాలని, అందుకు తగట్టుగా కొన్ని ప్రయోగాలు చేస్తుంది.నాన్సీ ఎవరి పై ఆ ప్రయోగాలు చేసింది? వాటివల్ల చనిపోయిన వారి కథ ఏంటి? వ్యూమ, డయానా,నాన్సీ ఈ ముగ్గురి శబ్దాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అవంతిక కథ ఏంటి? వ్యూమ ఎందుకు ఈ వృత్తిని ఎంచుకున్నాడు? ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ ని  ఘోస్ట్ ఎందుకు చంపింది? 34 ఏళ్ళ క్రితం జరిగిన  డయానా కథ ఏంటి? వికలాంగులైన పిల్లలు ఏమైపోయారు? వ్యూమ సాల్వ్ చేసిన పాయింట్ ఏంటనేదే ఈ చిత్ర కథ 

ఎనాలసిస్ 

ఇలాంటి హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన కథలు చాలానే వచ్చినప్పటికీ,ఇందులో ఎంచుకున్న ‘శబ్దం’ అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది.పైగా ఈ కథకి మెయిన్ పాయింట్ గా నిలిచిన మూడు నేపధ్యాలకి శబ్దాన్నిఎంచుకోవడం కూడా బాగుంది.కానీ దర్శకుడు ఈ విషయాన్నీ స్క్రీన్ మీద చెప్పడంలో రచయితగా ఫెయిల్ అయ్యాడేమో అనిపిస్తుంది. కాలేజీలో ముగ్గురు మెడికల్ స్టూడెంట్ చనిపోవడంతో వ్యూమ రావడం,వాళ్ళని చంపింది ఘోస్ట్ అని తెలుసుకోవడం, తన దగ్గరున్న పరికరాల ద్వారా వాటితో మాట్లాడాలని చూడటం,ఈ విధంగా వాటికి సంబంధించిన సీన్స్ తోనే ఫస్ట్ హాఫ్ మొత్తం నడిచింది.అలా కాకుండా ఈ కథకి మెయిన్ పిల్లర్స్ అయిన ముగ్గురు వ్యక్తుల చిన్ననాటి జీవితం నుంచి కథని చెప్పాల్సింది.ఆ విధంగా చెప్పి ఉంటే ఫస్ట్ హాఫ్ కి కావాల్సినంత స్టఫ్ దొరికేది.ఆ విధంగా కాకుండా గతంలో చాలా హర్రర్ సినిమాల మాదిరిగానే సీన్స్ ఉండటంతో, మూవీలో ఏముంది అని ప్రేక్షకుడు అనుకునేలా సాగింది. కనీసం ‘వ్యూమ’ ఎంచుకున్న శబ్ద తరంగాల ద్వారా ఆత్మలతో మాట్లాడటం అనే పాయింట్ ఎక్కడ పుట్టిందో,దాని ద్వారా గతంలో జరిగిన కొన్ని సన్నివేశాలైన చెప్పుండాల్సింది.ఎట్ లీస్ట్ కాలేజీ నేపథ్యంలో ఒక లవ్ స్టోరీ ని యాడ్ చేసుకొని ఉన్నా కూడా ప్రేక్షకుడికి కొంచం రిలీఫ్ ఉండేది.ఎంటర్ టైన్ మెంట్ ని మిక్స్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా ఆలోచించలేదు.ఇంటర్వెల్ ట్విస్ట్ ని కూడా ప్రేక్షకుడు ముందుగానే ఊహిస్తాడు.ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే  చాలా గ్రిప్పింగ్ గా సాగి మూవీని కొంచం కాపాడిందని చెప్పవచ్చు.అసలు ఈ సినిమా కథ మొత్తం సెకండ్  హాఫ్ లోనే ఉంది.సెకండ్ హాఫ్ లో చూపించిన పాయింట్స్ ని ఫస్ట్ హాఫ్ లో రివర్స్ స్క్రీన్ ప్లే తో కొన్ని సీన్స్ ని యాడ్ చేయాల్సింది.ఇటీవల వచ్చి బిగెస్ట్ హిట్ గా నిలిచిన విజయ్ సేతుపతి మహారాజ మూవీ ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యి ఘన విజయాన్ని అందుకుంది.డయానా క్యారక్టర్ తీరు తెన్నులు గాని,పుట్టుకతో అంగవికలాంగులైన పిల్లల పట్ల ఆమె చూపించే ప్రేమకి సంబంధించిన సన్నివేశాలన్నీ చాలా బాగున్నాయి.అదే పిల్లల పట్ల నాన్సీ డానియల్ కి అభిప్రాయాన్ని చూస్తే ఒళ్ళు జలతరించకమానదు. కాకపోతే నాన్సీ చేసే ప్రయోగాలని ఇంకొంచం లెన్త్ గా చూపించాల్సింది.వ్యూమకి, నాన్సీ డానియల్ నుంచి  ఎదురయ్యే సవాళ్ళకి సంబంధిచిన  సీన్స్ ని మరింతగా రాసుకొని ఉండాల్సింది. 

నటీనటుల సాంకేతిక నిపుణుల పని తీరు 

వ్యూమ  అనే క్యారక్టర్ లో ఆది పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.ఆది కోసమే వ్యూమ క్యారెక్టర్ డిజైన్ చేసారా అనేంతలా తన క్యారక్టర్ లో ఒదిగిపోయాడు.ఒక మనిషిని కాపాడాలనే తాపత్రయం,ఆత్మల లక్ష్యం నెరవేరాలనుకునే ఆది క్యారక్టర్ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.సిమ్రాన్ తో పాటు చాలా ఏళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన లైలా, లక్ష్మి మీనన్ ఈ ముగ్గురు తమ క్యారక్టర్  పరిధి మేరకు చాలా చక్కగా చేసారు.మిగతా క్యారక్టర్ ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు.థమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  మూవీకి చాలా హెల్ప్ అయ్యింది.తేలికపాటి సన్నివేశాలు కూడా థమన్ మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయ్యి,మూవీకి సరికొత్త హంగు వచ్చింది.  అరివళగన్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు గాని రచయితగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు.శబ్ద తరంగాల పై మరింతగా వర్క్ చేసి,ఆ విషయాన్నీ మాస్ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు. కాకపోతే సీన్స్ ని ఎలివేట్ చేసిన విధానం మాత్రం బాగుంది. ఫొటోగ్రఫీ ఎక్స్ లెంట్. ప్రతి ఫ్రేమ్ కూడా  రిచ్ గా ఉండి ప్రేక్షకుడు తన చూపుని పక్కకి తప్పుకొని విధంగా మెస్మరైజ్ చేసింది.నిర్మాణ విలువలు గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు.

ఫైనల్ గా చెప్పాలంటే పాయింట్ కొత్తది అయినా కూడా కథనాలు మాత్రం రెగ్యులర్ హర్రర్ సినిమాల మాదిరిగా    సాగడం వలన ‘శబ్దం’ ప్రేక్షకులకి  కనెక్ట్ అవ్వకపోవచ్చు.పెద్దగా భయపెట్టింది కూడా ఏమి లేదు.


 రేటింగ్ 2 .5 / 5                                                                                                        అరుణాచలం                                                                                                                     


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here